తదుపరి వార్తా కథనం
Smita Sabharwal: వ్యవసాయ వర్సిటీ కీలక నిర్ణయం.. స్మితా సభర్వాల్‌కి నోటీసులు..?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 19, 2025
05:32 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
వర్సిటీ నుంచి వాహన అద్దె కోసం నిధులు పొందడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు ఆమెకు నోటీసులు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
వాహన అద్దె కింద పొందిన నిధులను తిరిగి చెల్లించాలని, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.
Details
న్యాయ నిపుణుల మేరకు తదుపరి చర్యలు
సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో 2016 నుండి 2024 మార్చి వరకు 90 నెలలపాటు స్మితా సభర్వాల్ వాహన అద్దె కింద రూ. 61 లక్షలు తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై ఆడిట్ అభ్యంతరం సమర్థనీయమేనని వర్సిటీ వీసీ ధ్రువీకరించారు.
న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.