Page Loader
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు
తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. పవన్ ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని న్యాయవాది రామారావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, నవంబర్ 22న పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశాలను జారీ చేసింది.

Details

మనోభావాలు దెబ్బతిన్నాయి

తిరుమల లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ‌తిరుమలలో కల్లీ లడ్డుల్ని అయోధ్యకు పంపారని కూడా పవన్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. దీని వల్ల చాలా మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని సదరు పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తొంది. కోర్టు ఈ అంశంపై విచారణ ప్రారంభించి, పవన్‌కు సమన్లు జారీ చేయడం ఇప్పుడు ప్రధాన చర్చకు దారి తీసింది.