LOADING...
Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు
ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు

Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. జనార్ధన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత అతడి ఫోన్‌ గురించి విచారణ జరుగగా, ఆఫ్రికా నుంచి వస్తుండగా, ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని ఆయన తెలిపారు. దీనివల్ల, జనార్ధన్ పేరుతో మరో సిమ్‌ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఫోన్ కాల్ డేటా కనుగొనడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Details

రిమాండ్ పొడగింపు

నకిలీ మద్యం కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్ధన్‌కు ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. దీంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు జనార్ధన్ 2021 నుంచి అక్రమ మద్యం వ్యాపారం ప్రారంభించారని తేలింది. ముందుగా ఏఎన్ఆర్ బార్‌లో నష్టాలు రావడంతో నకిలీ మద్యం వ్యాపారంలో అడుగు పెట్టినట్లు గుర్తించారు. వ్యాపారం ప్రారంభంలో హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి అక్రమ మద్యం తరలించాడని వెల్లడైంది. అదనంగా నకిలీ ఇన్వాయిస్లతో జనార్ధన్ మద్యం విజయవాడలోని ఇబ్రహీంపట్నంకు పంపించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.