తదుపరి వార్తా కథనం

PM Kisan Samman: కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. 9.7 కోట్ల ఖాతాల్లో రూ.20,000 కోట్లు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2025
11:42 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 20 వేల కోట్లకుపైగా మొత్తాన్ని నేరుగా జమ చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున నగదు మంజూరవుతుంది. కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ రైతులకు కేంద్రం అందజేస్తున్న మద్దతును వివరించారు.