Assam: అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా నుంచి మిజోరంలోని సైరంగ్‌కు వెళ్తున్న కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (Kolkata-Sairang Express) కామ్‌రూప్ జిల్లాలోని డిగార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు ఉన్న ఆరు బోగీలు పట్టాలు తప్పగా, పలువురు గాయపడ్డారు. బుధవారం ఉదయం 6.54 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి బయల్దేరారు.
వివరాలు
పట్టా నుంచి మరో పట్టాపైకి మారుతున్న సమయంలో సాంకేతిక సమస్య
గువాహటి నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
రైలు ఇంజిన్‌తో పాటు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. గువాహటి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్ నుంచి ప్రయాణాన్ని ప్రారంభించింది.
బుధవారం మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్ చేరుకోవాల్సి ఉంది.
రైలు ఒక పట్టా నుంచి మరో పట్టాపైకి మారుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి సంఖ్యపై రైల్వే అధికారులు మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గువాహటి సమీపంలో రైలు ప్రమాదం
BREAKING 🚨
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) November 11, 2026
In Assam, Kolkata-Sairang Express Derails Near Digaru, 7 Coaches Go Off Track
According to the initial report, the derailment took place near Digaru, prompting the deployment of rescue teams and railway personnel to the spot. Three injured passengers were shifted to… pic.twitter.com/CzfGg2CVtI