Kota: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.8-10 లక్షల అమ్మకాలు..
భారతదేశ ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ రూపొందించబడింది. దేశంలో ఎవరు నేరం చేసినా,దోషిగా తేలినా నేరానికి సంబదించిన చట్టాల ఆధారంగా నేరస్థులు జైలుకు పంపబడతారు.అక్కడ వారు నిర్దేశించిన శిక్షను అనుభవిస్తారు. కానీ భారతీయ చట్టం ఈ నేరస్థులకు మంచి వ్యక్తులుగా మారడానికి అవకాశం ఇస్తుంది. రాజస్థాన్ లోని కోట జైలు ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ పెట్రోల్ పంప్‌ను ప్రారంభించారు. ప్రతిరోజు చాలా మంది వాహనదారులు పెట్రోల్ కోసం ఈ పంపు వద్దకు వస్తుంటారు. ఇది సాధారణ పెట్రోల్ పంపు అని మీరు అనుకోవచ్చు,కానీ ఈ పెట్రోల్ పంప్‌లోని ప్రతి సిబ్బంది ఒకప్పుడు క్రూరమైన నేరస్థులని మీకు తెలుసా? అవును,ఈ జైలులోని ఖైదీలు ఈ పెట్రోల్ పంపులో సిబ్బందిగా పనిచేస్తారు.
కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తున్నఖైదీలు
జైలు లోపల నిర్మించిన ఈ పెట్రోల్ పంపు రోజుకు లక్షల్లో లాభాలు గడిస్తోంది. ఖైదీల మనోధైర్యాన్ని పెంచేందుకు చాలా మంది ఈ పంపు వద్దకు వస్తుంటారు. ఇక్కడ ఉన్న ప్రతి సిబ్బంది ఏదో ఒక నేరం చేసినవారే కావడం గమనార్హం.అయితే ఇప్పుడు ఈ నేరగాళ్లు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఈ పంపు వల్ల జైలులోనే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ జైలు లోపల ఉన్నపెట్రోల్ పంప్ విషయం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చినప్పుడు, చాలా మంది ఈ ఆలోచనను ప్రశంసించారు. ఇది చాలా గొప్ప ఆలోచన అని కామెంట్ చేశారు. దీని ద్వారా ఖైదీలకు ఉపాధి లభించడమే కాకుండా, పని చేయడం ద్వారా వారి నేర ప్రవృత్తి తొలిగిపోతుంది.
కేరళలో జైలు ఖైదీలతో నడిచే బ్యూటీ పార్లర్
కోటాలోని సెంట్రల్ జైలు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆశయైన్ అంటారు. ఈ పెట్రోల్ పంపు రోజువారీ విక్రయం రూ. 8-10 లక్షల మధ్య ఉంటుంది. ఒక్క కోటానే కాదు.. తిరువనంతపురంలో పూర్తిగా జైలు ఖైదీలతో నడిచే బ్యూటీ పార్లర్ ఉంది. మహమ్మారి సమయంలో, పెరుగుతున్న డిమాండ్ మధ్య కేరళలోని జైలు ఖైదీలు ఫేస్ మాస్క్‌లను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా , కేరళ జైలులో ఖైదీలు తయారు చేసిన బిర్యానీని కూడా విక్రయిస్తున్నారు. ఇది వినియోగదారులలో విపరీతమైన క్రేజ్ ను పెంచింది. ఇటువంటి కార్యక్రమాలు ఖైదీలు మళ్లీ నేరం చేసే అవకాశాలను తగ్గిస్తాయి. చట్టబద్ధమైన, ఉత్పాదక జీవితాన్ని గడపడానికి వారికి సహాయపడతాయి.