LOADING...
Palnadu: పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య
పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య

Palnadu: పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరోసారి రౌడీ ఘటన చోటుచేసుకుంది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రకారం, మృతులు క్రొత్త హనుమంతరావు,క్రొత్త శ్రీరామమూర్తి, వీరిని టీడీపీ కార్యకర్తలుగా గుర్తించారు. దుండగులు ప్రణాళికా ప్రకారం వేట కొడవళ్లతో వీరిని నరికి చంపడంతో, సంఘటన గ్రామంలో పెద్ద కలకలం రేపింది. హనుమంతరావు శవాన్ని గ్రామ శివారులోని ఒక బండరాయి వద్ద కనుగొన్నారు, శ్రీరామమూర్తి శవం నీలంపేట అమ్మవారి గుడి సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద కనుగొనగా.. ఈ హత్యల విధానం అత్యంత పాశవికంగా, వేట కొడవళ్లతో జరిగినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి,పూర్తి వివరాలు సేకరించారు.

వివరాలు 

నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు 

హత్యకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలు ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, రాజకీయ కోణాన్ని కూడా తోసిపుచ్చడం లేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల్లో,ఆ ప్రాంత సమీపంలోని గుండ్లపాడు గ్రామంలో కూడా ఇలాగే జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటన పూర్తిగా తీరకముందే, ఇప్పుడు జరిగిన ఈ హత్యలతో పల్నాడు వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement