తదుపరి వార్తా కథనం
BRS Whips: తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ విప్‌గా కేపీ వివేకానంద్, మండలిలో సత్యవతి రాథోడ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 04, 2025
02:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని చట్టసభల్లో బీఆర్‌ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్ గౌడ్ నియమితులయ్యారు.
శాసన మండలిలో పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించగా, శాసన సభలో పార్టీ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు.
బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ నిర్ణయం తీసుకుని, సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్ గౌడ్‌లకు విప్ పదవులు కట్టబెట్టాలని సూచించారు.
Details
నియామక పత్రాలు అందజేత
పార్టీ అధినేత ఆదేశాల మేరకు అధికారికంగా వారి నియామకం జరిగింది.
ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్ గౌడ్‌లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి స్పీకర్‌కు తమ నియామక పత్రాలను అందజేశారు.