Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఆగనుందని వాటర్‌బోర్డు ప్రకటించింది. విద్యుత్ సంబంధిత మరమ్మతుల కారణంగా కృష్ణా జలాల పంపింగ్ కార్యకలాపాలు సుమారు ఆరు గంటల పాటు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు. బల్క్ ఫీడర్లను సర్వే చేయడంతో పాటు పనిచేయకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చే పనులు జరుగుతున్నందున నీటి పంపిణీ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా అందించే వ్యవస్థల్లోను ఈ పనులు చేపడతారని చెప్పారు. నాగార్జునసాగర్ పరిధిలోని నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లకు అనుబంధంగా ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా రేపు ఉదయం 10 గంటలకు నిలిపి, సాయంత్రం 4 గంటలకు పునరుద్ధరిస్తారు.
వివరాలు
విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు
ఉప్పల్, హఫీజ్‌పేట్, రాజేంద్రనగర్, మణికొండ, బోడుప్పల్, మీర్‌పేట్, చార్మినార్, వినయ్‌నగర్, బోజగుట్ట, రెడ్‌హిల్స్, నారాయణగూడ, ఎస్సార్ నగర్, మారేడ్‌పల్లి, రియాసత్ నగర్, కూకట్‌పల్లి, సాహెబ్‌నగర్, హయత్‌నగర్, సైనిక్‌పురి