LOADING...
Krishna River: కృష్ణమ్మ'కు సమస్యలు పెరుగుతున్నాయి.. దుర్వాసనలో పెను సవాళ్లు
'కృష్ణమ్మ' సమస్యలు పెరుగుతున్నాయి.. దుర్వాసనలో పెను సవాళ్లు

Krishna River: కృష్ణమ్మ'కు సమస్యలు పెరుగుతున్నాయి.. దుర్వాసనలో పెను సవాళ్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణానది నీరు రెండు నెలలుగా రంగు మారి కనిపిస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల నుంచి మాచవరం మండలం వరకు మొత్తం 20 కి.మీ. మేర నీరు నీలం ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. దుర్వాసనా వస్తోంది. ఇసుకపై ఆనవాళ్లను బట్టి రసాయనాలే ఇందుకు కారణమని అర్థమవుతున్నా అధికారుల్లో చలనం లేదు. గుంటూరు నుంచి కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది వచ్చి కొన్ని నమూనాలు తీసుకెళ్లారు. ఆ నివేదిక ఇంతవరకూ బయటపెట్టలేదు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రెండు వైపులా ఇదే పరిస్థితి ఉండటంతో ఎవరికివారు తమకు సంబంధం లేదన్నట్లు ఉంటున్నారని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

Advertisement