
Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రూ.450 కోట్ల వ్యయంతో 2.25 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెనను నిర్మించారు. హుస్సేన్ సాగర్, పీవీఎన్‌ఆర్ మార్గ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు.
భవిష్యత్తులో ఇందిరాపార్కు, లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్‌లను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కింగ్ సౌకర్యం, డెక్‌లు తదితరాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రామారావు తెలిపారు.
ఈ స్టీల్ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఈ ప్రాంతంలో రద్దీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి అన్నారు.
హైదరాబాద్
25నిమిషాల సమయం ఆదా
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్‌ఆర్‌డీపీ)లో ఈ వంతెన 36వ ప్రాజెక్ట్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని కేటీఆర్ అన్నారు.
ఈ రహదారి ద్వారా రోజుకు లక్ష వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
అధిక ట్రాఫిక్ వల్ల బహుళ జంక్షన్ల కారణంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, నల్లకుంట వంటి గమ్యస్థానాలకు చేరుకోవడానికి దాదాపు 30నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది.
స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడం వల్ల కేవలం 5 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఫలితంగా 25 నిమిషాల సమయం ఆదా అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టీల్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్న కేటీఆర్
🛣️ Minister @KTRBRS inaugurated Nayini Narasimha Reddy Steel Bridge connecting Indira Park to VST.
— Mission Telangana (@MissionTG) August 19, 2023
🛣️ #Telangana govt. has built 20 flyovers and completed a total of 36 works under #SRDP in #Hyderabad since 2014.#HappeningHyderabad pic.twitter.com/mNgKfophS1