
Telangana: దివంగత నాయినికి అరుదైన గౌరవం.. స్టీల్ బ్రిడ్జ్‌కు 'నాయిని నర్సింహారెడ్డి'గా నామకరణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డికి అరుదైన గౌరవం లభించింది.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్‌కు దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికార ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
రాష్ట్ర తొలి హోంమంత్రిగా, ముషిరాబాద్ ఎమ్మెల్యేగా, వీఎస్టీ వర్కర్స్ యూనియన్ నేతగా అందించిన సేవలకు గాను ఆయన పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేసిన విషయం తెలిసిందే.
Details
శనివారం బ్రిడ్జిని ప్రారంభించనున్న కేటీఆర్
రూ.450 కోట్లతో నిర్మించిన ఈ పొడువైన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఎన్ఆర్డీపీలో భాగంగా జిహెచ్ఎంసీ పరిధిలో 2.63 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ వంతెను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద జీహెచ్ఎంసీ నిర్మించిందని తెలిపారు.
ఫ్లైఓవర్ ఈ ప్రాంతంల్లో అందుబాటులోకి వస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.