Page Loader
Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం
12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం

Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరగనుంది. ఈ సాంప్రదాయ ఆధ్యాత్మిక వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వందలాది అఖాడాలు ఇప్పటికే అక్కడకు చేరుకుని తమ పీఠాలను ఏర్పాటు చేశాయి. రైల్వే శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. ఈ మహోత్సవానికి 50 రోజులపాటు 13 వేల రైళ్లు నడవనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా ప్రారంభానికి ముందే కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

Details

 ప్రయోగరాజ్ కేంద్రంగా 14 కేంద్రాలు

కుంభమేళా జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని ప్రయాగ్‌రాజ్‌లోని ముస్లిములు పేర్కొన్నారు. ముస్లిముల వాదన ప్రకారం, ఈ భూమి 54 బిఘాల (దాదాపు 34 ఎకరాలు) పరిధిలో ఉంది. ఈ భూమి ముస్లిములదేనని, హిందువుల ఉత్సవాలకు అనుమతించడం తమ విశాల హృదయానికి నిదర్శనమని అఖిల భారత ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ చెప్పారు. హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ప్రదర్శించాలని ఆయన కోరారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న కుంభమేళా కోసం ప్రాంతాన్ని మొత్తం 25 విభాగాలుగా విభజించారు. వాటిలో 14 ప్రయాగ్‌రాజ్‌ కేంద్రంగా, మిగిలిన 9 ఝున్సీ వద్ద ఏర్పాటుచేశారు.

Details

భక్తుల కోసం 13వేల ప్రత్యేక రైళ్లు

భారీ భద్రత కోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేటు రికగ్నిషన్ టెక్నాలజీ, యాంటీ-డ్రోన్ వ్యవస్థ, అండర్‌వాటర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కుంభమేళాకు యాత్రికులను తరలించేందుకు రైల్వే శాఖ 13 వేల రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో 10 వేల రెగ్యులర్ రైళ్లు, 3 వేల ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్సవం ప్రారంభానికి ముందు 2-3 రోజులు, ముగిసిన తర్వాత 2-3 రోజులు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయాన్ని కలిగి ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. వక్ఫ్ భూమి వివాదం నేపథ్యంలో పునాది స్థాయిలో చర్చలు కొనసాగుతుండగా, ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.