LOADING...
Kurnool Bus Accident: కర్నూలు బస్సు విషాదం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత 
కర్నూలు బస్సు విషాదం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత

Kurnool Bus Accident: కర్నూలు బస్సు విషాదం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎన్‌ఏ పరీక్షా నివేదికల ఆధారంగా గుర్తింపు పూర్తి చేసిన అనంతరం ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రతి మృతుడికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా అధికారులే కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ఎ. సిరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Details

అన్ని విధాలా సాయమందించేందుకు చర్యలు

మృతదేహాలు మరియు బాధిత కుటుంబాల డీఎన్‌ఏ నమూనాలను సరిపోల్చిన తరువాతే అప్పగింత పూర్తవుతోంది. అంతేకాకుండా మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అధికారులు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.