 
                                                                                Kurnool Bus accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో, బస్సు నుంచి 11 మంది మరణించిన వ్యక్తుల శవాలను వెలికితీసినట్టు కలెక్టర్ సిరి తెలిపారు. బైక్ మొత్తం బస్సు కిందికి వెళ్లిపోయిందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు: కలెక్టరేట్‌లో: 08518-277305. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059. ఘటనాస్థలి వద్ద: 91211 01061. కర్నూలు పోలీసు స్టేషన్‌లో: 91211 01075. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(హెల్ప్ డెస్కు) : 94946 09814, 90529 51010
వివరాలు
ప్రయాణికులు తేరుకునేలోపు బస్సు దగ్ధం: డీఐజీ
డీఐజీ సూచనల ప్రకారం,బస్సులో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో సురక్షితంగా ఉన్న 19 మంది గుర్తించామని, వారికి ఆసుపత్రిలో వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో బస్సు దగ్దమైందని, ప్రధాన డ్రైవర్‌ను గుర్తించలేదని, మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌కి ఎలాంటి హాని కలగలేదని, బైక్ ఢీకొని మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని కూడా వెల్లడించారు.