LOADING...
Kurnool: కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు.. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు.. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Kurnool: కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు.. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగాయి. తుని, మచిలీపట్నం, నందిగామ, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల మార్కును దాటాయి. ఇందులో కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు నమోదు కాగా, అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వివరాలు 

మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు 

ఇదిలా ఉండగా, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారం నాటికి సాధారణ అల్పపీడనంగా బలహీనమైంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మంగళవారం కల్లా మరింత క్షీణించే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే పరిస్థితి ఉండవచ్చని హెచ్చరిస్తూ, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Advertisement