NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు
    తదుపరి వార్తా కథనం
    1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు
    1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు

    1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2024
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డును ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు.

    ఈరోజు హైదరాబాద్ నుంచి లడ్డును అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. లడ్డును శీతలీకరించిన గాజు పెట్టెలో తీసుకువెళతారు.

    ఈ లడ్డూను తయారు చేసేందుకు దాదాపు 30 మంది 24 గంటల పాటు నిరంతరం శ్రమించారని నాగభూషణ్ రెడ్డి తెలిపారు.

    "నాకు 2000 సంవత్సరం నుండి శ్రీ రామ్ క్యాటరింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ ఉంది.రామజన్మభూమి ఆలయంలో భూమి పూజ జరుగుతున్నప్పుడు,శ్రీరామునికి ఏమి నైవేద్యం ఇవ్వవచ్చు అని ఆలోచించాము.తరువాత,మేము ఒక ఆలోచన చేసాము.భూమి పూజ రోజు నుంచి ఆలయం తెరిచే రోజు వరకు ప్రతి రోజు 1కేజీ లడ్డూ అందజేస్తాం''అని నాగభూషణ్ రెడ్డి ఏఎన్‌ఐకి తెలిపారు.

    Details 

    లడ్డుసిద్ధం చేయడానికి 4 గంటలు

    "మేము మందిరం కోసం ఈ 1,265 కిలోల లడ్డూను ఎలా సిద్ధం చేసాము. మేము ఈ లడ్డును హైదరాబాద్ నుండి అయోధ్యకు రిఫ్రిజిరేటెడ్ బాక్స్‌లో యాత్రగా తీసుకెళుతున్నాము. మేము జనవరి 17 న హైదరాబాద్ నుండి అయోధ్యకు రోడ్డు మార్గంలోప్రయాణిస్తాము. లడ్డు తయారీకి సుమారు 30 మంది పనిచేశారు. ఈ లడ్డూను తయారు చేయడానికి 24 గంటలపాటు నిరంతరంగా శ్రమించాము. లడ్డును సిద్ధం చేయడానికి మాకు 4 గంటలు పట్టింది,"అని నాగభూషణ్ రెడ్డి తెలిపారు.

    ఇదిలా ఉండగా, అయోధ్యలో వారం రోజుల పాటు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రెండో రోజైన బుధవారం శ్రీరామ్‌ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో శ్రీరామ్‌లల్లా విగ్రహం పర్యటిస్తుందని వేదపండితులు ఆచార్య శ్రీ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ తెలిపారు.

    Details 

    జనవరి 23 నుంచి సామాన్య ప్రజల కోసం 'దర్శనం' 

    మంగళవారం శ్రీ రామజన్మభూమి ఆలయంలో విష్ణువును పూజించిన అనంతరం పంచగవ్య (పాలు, మూత్రం, పేడ, నెయ్యి, పెరుగు)తో పంచగవ్యప్రాశన నిర్వహించారు.

    విగ్రహాల తయారీ స్థలంలో కర్మకుటి హోమం కూడా నిర్వహించి, మంగళవారం మంటపం వద్ద వాల్మీకి రామాయణం, భూసుండిరామాయణం పారాయణం చేసినట్లు రామజన్మభూమి ఆలయ ట్రస్టు తెలిపింది.

    రామజన్మభూమి ఆలయాన్ని జనవరి 23 నుంచి సామాన్య ప్రజల కోసం 'దర్శనం' కోసం తెరవనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

    వేలాది మంది ప్రముఖులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    అయోధ్య

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    హైదరాబాద్

    TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన తెలంగాణ
    Ktr : హల్లో కేటీఆర్ మామ, హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తీసుకురా ప్లీజ్  తెలంగాణ
    Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?  కోల్‌కతా
    Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ చంద్రబాబు నాయుడు

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  శ్రీరాముడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025