
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసిన గంటలోనే ఆస్తి పత్రాలు అందుబాటులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో వినూత్న మార్పులు చేస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు డిజిటలైజేషన్ సహాయంతో ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (IGRS)ను వినియోగంలోకి తెచ్చి,రిజిస్ట్రేషన్ పూర్తయిన గంటలోపే సంబంధిత పత్రాలను అందించే విధానం ప్రారంభించింది. IGRS పోర్టల్ ద్వారా ముందుగానే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ముందుగా స్లాట్ రిజర్వ్ చేసుకున్న వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యగానే ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్ (EC) రిజిస్టర్డ్ డీడ్ వంటి పత్రాలను తక్షణమే జారీ చేస్తారు. ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
వివరాలు
రిజిస్ట్రేషన్ చేసిన గంటలోపే..
ఇప్పుడీ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర రెవెన్యూ డేటాబేస్‌తో అనుసంధానం చేయడంతో పత్రాల ధృవీకరణ మరియు జారీ ప్రక్రియ వేగవంతమైంది. ఆధార్ ఆధారిత ఈ-కెవైసీ మరియు డిజిటల్ సంతకాలు రిజిస్ట్రేషన్‌ను మరింత త్వరితగతిన పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పుల ఫలితంగా గతంలో వారం రోజుల తరువాత లభించేవి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన గంటలోపే ప్రజల చేతికి చేరుతున్నాయి.