Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కురుస్తున్న వర్షాలకు తలలు విరిగిపోయిన కొండచరియలు రామకృష్ణనగర్‌లోని కాళీమాత గుడి దారిలో విరిగిపోయాయి. పలు ఇళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే, స్థానిక ఎమ్మెల్యే గణపతి బాబు అధికారులను సంప్రదించి, సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని, కొండచరియలు విరిగిపోయిన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొండచరియలు విరిగిన క్రమంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ
కొండచరియలు విరిగిన ప్రాంతం పరిస్థితిని అంచనా వేయడం, ఎన్ని ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయో తేల్చడం, ఆ ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గణపతి బాబు సూచించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోపాలపట్నంలో కొండవాలల ప్రాంతంలో చాలా ఇళ్లు ఉన్నాయి, ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఇళ్లు ఉండడం వల్ల అధికారులు అవసరమైన చర్యలపై ఆలోచిస్తున్నారు. ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.