
Landslide: అరుణాచల్‌లో కొండచరియలు బీభత్సం.. డిరాంగ్-తవాంగ్ రోడ్డుపై రాకపోకలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో కొండచరియలు (Landslide) తీవ్ర బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా డిరాంగ్-తవాంగ్ రోడ్డులో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడిపోయి, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం డిరాంగ్-తవాంగ్ మధ్య రోడ్డులో సుమారు 120 మీటర్ల స్థలం పూర్తిగా ధ్వంసమై, వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Details
శరవేగంగా పునరుద్ధరణ పనులు
వీడియోలో గమనిస్తే, కొందరు ప్రయాణికులు తమ కార్ల నుండి వేగంగా దిగుతూ, "పై నుంచి ఏదో పడుతోంది, త్వరగా కార్లను వెనక్కి తీయండి.. బ్యాక్ మారో అంటూ కేకలు వేస్తూ పరుగెత్తారు. మరొకరు "ఇంకా వస్తున్నాయ్, త్వరగా పదండి, హటో హటో" అంటూ వారిని హెచ్చరించారు. కొన్ని వాహనాలపై బండరాళ్లు, మట్టి పడిన క్షణాలు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొండచరియాల కారణంగా ధ్వంసమైన రోడ్డు పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆ మార్గం ద్వారా వాహనాలను బుధవారం నుంచి మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.