జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం బారాముల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటీ) ఉగ్రవాదిని అరెస్టు చేశారు. గత 24గంటల్లో బారాముల్లాలో ఇది రెండో అరెస్ట్ అని పోలీసులు వెల్లడించారు.
29 రాష్ట్రీయ రైఫిల్స్, 2వ బెటాలియన్ సశాస్త్ర సీమా బల్‌తో కలిసి సింగ్‌పోరా పట్టాన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పాయింట్ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తిని సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతను పారిపోయేందుకు ప్రయత్నించగా, చాకచక్యంగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జమ్ముకశ్మీర్
పేలుడు పదార్థాలు, ఏకే 47 తుపాకీ స్వాధీనం
పట్టుబడిన వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద పేలుడు పదార్థాలు, ఏకే 47 తుపాకీ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఉగ్రవాదిని బోనిచకల్ అరంపొర పట్టాన్‌కు చెందిన అలీ మహ్మద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. అతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌ఇటికి సహచరుడిగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
పట్టాన్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రతినిధి తెలిపారు.
మంగళవారం ఉత్తర కశ్మీర్‌లో లక్షిత దాడులకు ప్లాన్ చేస్తున్న అదే గ్రూపుకు చెందిన మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు.