
Omar Abdullah: జమ్ముకశ్మీర్ లో ఆధిక్యంలో నేషనల్ కాన్ఫరెన్స్..సెల్ఫీ పోస్టు చేసిన ఒమర్ అబ్దుల్లా
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.90 స్థానాలున్న రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం,ఎన్‌సీ,కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది.
ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 39 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఆ పార్టీ ప్రధాన నేత ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల నుండి ఆధిక్యంలో ఉన్నారు. బుద్గామ్,గందర్‌బాల్ లో ఆయన పోటీ చేస్తూ,ఆ రెండు స్థానాల్లోనూ ఆయన లీడింగ్‌ను కొనసాగిస్తున్నారు.
వివరాలు
కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 51 సీట్ల మార్క్
తాజా ట్రెండ్స్ ప్రకారం,కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి ఇప్పటికే 51 సీట్ల మార్క్ చేరుకుంది.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో,ఇవాళ ఉదయం ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు. మార్నింగ్ వాక్ చేస్తూ తీసిన ఫోటోను పోస్ట్ చేసి,ఇవాళ కౌంటింగ్ రోజు అని,గత కౌంటింగ్ రోజున వ్యక్తిగతంగా కలిస రాలేదని, కానీ ఈసారి కలిసి రాగలమని అల్లాను వేడుకుంటున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఒమర్ అబ్దుల్లా ట్వీట్
Counting day 7K done. Last time around it didn’t end well for me personally. InshaAllah this time around it will be better. pic.twitter.com/TUkjLtVKGn
— Omar Abdullah (@OmarAbdullah) October 8, 2024