తదుపరి వార్తా కథనం

Lavu Sri Krishna Devarayalu: టిడిపిలోకి వైసీపీ ఎంపీ.. ముహూర్తం ఖరారు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 01, 2024
10:44 am
ఈ వార్తాకథనం ఏంటి
నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది.
టిక్కెట్ల కేటాయింపులో నెలకొన్న సందిగ్ధంతో ఇటీవలే అయన వైసీపీకి రాజీనామా చేశారు.
మార్చి 2వ తేదీన పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో జరుగనున్న రా..కదలిరా సభలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ట్వీట్
మార్చి 2న దాచేపల్లిలో జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపిలోకి చేరుతున్నాను. ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్న నన్ను మరలా ఆశీర్వదించాలని ప్రజనీకాన్ని కోరుతున్నాను.
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) February 29, 2024