స్వలింగ పెళ్లిలకు యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు : లా కమిషన్
స్వలింగ వివాహాలకు సంబంధించి సెంట్రల్ లా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదరు నివేదికను కేంద్ర ప్రభుత్వంకు సమర్పించింది. సేమ్ సెక్స్ మ్యారేజీకి యూసీసీ వద్దు.. స్వలింగ పెళ్లిళ్లకు ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) వర్తింపజేయలేమని లా కమిషన్ పేర్కొంది. ఈ మేరకు స్వలింగ వివాహాలను జాబితా నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. మతంపై ఆధారపడకుండా ఉమ్మడి పౌరస్మృతి దేశ పౌరులందరికీ ఒకే చట్టాన్ని అందిస్తుంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక తదితర అంశాలన్నింటిలోనూ, వివిధ మతాలకు ఉండే 'పర్సనల్ లా'లు ఒకే గొడుకు కిందకు వస్తాయి. అదే ఉమ్మడి స్మృతి.
బహుభార్యాత్వం, నిఖా హలాలా , ఏకపక్ష విడాకులుపై వ్యతిరేకత
యూసీసీ పరిధిలోకి స్వలింగ వివాహాలు రావని లా కమిషన్ తమ నివేదిక ద్వారా కేంద్రానికి వెల్లడించడం గమనార్హం. వివాహాలకు సంబంధించి, మతాలు, వాటి ఆచారాలను ఉమ్మడి పౌరస్మృతి పరిధిలోకి వెళ్లనున్నట్లు లా కమిషన్ నివేదిక రూపొందించింది. అదే సమయంలో ఏకరీతిగా విడాకులు, నిర్వహణ, వారసత్వం మొదలైన చట్టాలపై దృష్టి సారిస్తాయని నివేదికలో పేర్కొంది. మరోవైపు బహుభార్యాత్వం, నిఖా హలాలా , ఏకపక్ష విడాకులు మొదలైన వాటిని వ్యతిరేకించే లా ప్యానెల్ తరఫున నివేదికలో సూచనలు ఉంటాయని తెలుస్తోంది.