LOADING...
Telangana: ఉక్కపోతకు బ్రేక్‌.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్
ఉక్కపోతకు బ్రేక్‌.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

Telangana: ఉక్కపోతకు బ్రేక్‌.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న రాత్రి నుంచి పలుచోట్ల మేఘాలు కమ్ముకోవడంతో పాటు తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌, బాలానగర్‌, బోయిన్‌పల్లి, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, లక్డీకాపూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. వర్షంతో రోడ్లు తడిసిపోగా, ఎండ తీవ్రత తగ్గింది.

వివరాలు 

పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు జోగులాంబ గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో వచ్చే రెండు నుంచి మూడు గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement