LOADING...
Weather Report: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు..  పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Weather Report: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు..  పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

వివరాలు 

పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ

శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షపాతం కొనసాగవచ్చని తెలిపారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్లతో పాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement