
Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణం.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు రిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు మే 6 వరకు రిమాండ్ విధించింది.
ఈ మేరకు సిట్ అధికారులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని అయిన సజ్జల శ్రీధర్‌రెడ్డి, మద్యం కుంభకోణం కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు.
కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రీధర్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
అనంతరం శనివారం విజయవాడకు తీసుకువచ్చి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.
Details
రూ.60 కోట్ల వరకు ముడుపులు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, నూతన మద్యం విధానం పేరుతో నెలకు రూ.50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు ఎలా వసూలు చేయాలని చర్చించేందుకు నిర్వహించిన సమావేశాల్లో శ్రీధర్‌రెడ్డి కూడా పాల్గొన్నాడు.
ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, అప్పటి వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి, ఆ కాలంలో ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అలాగే ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌లు కూడా పాల్గొన్నట్లు సమాచారం.