Page Loader
Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే?
రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే?

Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తదుపరి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయనున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే స్టార్‌ హోటల్స్‌, రిజిస్టార్‌ క్లబ్స్‌కు ఈ నిషేధానికి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Details

48 గంటలు ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం

అదే సమయంలో, గురువారం మధ్యాహ్నం నగరంలోని మియాపూర్‌, గచ్చిబౌలి, ఎస్సార్‌ నగర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షాలు కుమ్యులోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఏర్పడ్డాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇకపై 48 గంటల పాటు ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.