LOADING...
Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి..
ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి..

Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని లూథియానా నగరంలో ఒక అసహ్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని సుందర్‌నగర్ ప్రాంతంలో నివసించే ఏడేళ్ల బాలుడు సోమవారం "మిల్క్ బెల్" అనే బండి వద్దకు వెళ్లి రూ.20 చెల్లించి రెండు చాకో బార్ కుల్ఫీ ఐస్‌క్రీంలను కొనుగోలు చేశాడు. ఆ ఐస్‌క్రీం తినేటప్పుడు, అందులో బల్లి కనిపించడంతో వెంటనే అతను తన అమ్మమ్మకు విషయాన్ని తెలియజేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఐస్‌క్రీం విక్రేతను ప్రశ్నించగా, ఆ వ్యక్తి "ఇవి నేను తయారు చేయలేదు, ఫ్యాక్టరీలోనే ప్యాక్ అయి వస్తాయి" అంటూ సమర్థించుకున్నాడు.

వివరాలు 

పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి.. 

అయితే, ఆ ఐస్ క్రీమ్స్ అమ్ముకునే వ్యక్తి స్థానికులతో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయి.. అదే ప్రాంతంలో ఐస్ క్రీంలు అమ్మడం కొనసాగించాడు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం మరింత పెరిగి, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఐస్‌క్రీం తిన్న చిన్నారి ఆరోగ్యం క్షీణించకుండా ఉండటానికి,అతన్ని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఐస్‌క్రీంలో బల్లి కనిపించిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలిస్తున్నామని, జూన్ 10న పరీక్షల కోసం సంబంధిత ఐస్‌క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్యాధికారి (DHO) స్పష్టం చేశారు.