LokSabha: మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్ - 2025కు ఆమోదం లభించింది. అక్టోబర్ 7న జారీ చేసిన ఆర్డినెన్స్‌ను భర్తీ చేయడమే ఈ బిల్లు ఉద్దేశంగా ఉంది. 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మేరకు దాదాపు 375 వస్తువులపై ఉన్న పన్ను స్లాబ్‌లను రెండు కొత్త రేట్లుగా.. 5శాతం,18శాతంగా విలీనం చేయడం,అతి విలాస వస్తువులపై 40శాతం పన్ను విధించే ప్రతిపాదన అమలు చేయడం ఇందులో భాగం. సెప్టెంబర్ 22 నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి రావడంతో,మణిపూర్ రాష్ట్ర జీఎస్టీ చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా జూన్ 9న తీసుకొచ్చిన మణిపూర్ జీఎస్టీ(అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్ - 2025ను ఇప్పుడు ఈ బిల్లు భర్తీ చేస్తోంది.
వివరాలు
శీతాకాల సమావేశాల్లో చర్చకు 13 కీలక బిల్లులు
ఇదే సమయంలో సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం,పాన్‌మసాలా తయారుపై సెస్ విధించే రెండు చట్టాలతో పాటు మొత్తం మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టారు. శీతాకాల సమావేశాల్లో చర్చ కోసం ప్రభుత్వం మొత్తం 13 బిల్లులను జాబితాలో చేర్చింది. వీటిలో జన విశ్వాస్ సవరణ బిల్,ఐబీసీ సవరణ బిల్,జాతీయ రహదారుల సవరణ బిల్,అణుఊర్జా బిల్,కార్పొరేట్ లాస్ సవరణ బిల్,సెక్యూరిటీస్ మార్కెట్లు కోడ్ బిల్, ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్, ఆర్బిట్రేషన్ సవరణ బిల్ ఉన్నాయి. మరోవైపు ఎస్‌ఐఆర్ అంశంపై చర్చ కావాలంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టడంతో లోక్‌సభ రోజంతా వాయిదా పడింది. సభను డిసెంబర్ 2న మళ్లీ సమావేశం చేయనున్నట్టు ప్రకటించారు.