Loksabha : లోక్‌సభ దాడి నిందితుల బ్యాగ్రౌండ్ తెలుసా.. ఒకరు ఇంజనీర్ మరొకరు ఆటో డ్రైవర్, ఇంకొకరు ఉన్నత విద్యావంతురాలు
లోక్‌సభపై దాడి చేసిన(Loksabha Security Breach)నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మొత్తం ఆరుగురు కలిసి 18 నెలలుగా దాడికి ప్లాన్ చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. సాగర్ శర్మ, మనోరంజన్ సభలో దాడి చేయగా అమోల్ శిందే, నీలం దేవి పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘటనతో మరో ఇద్దరికీ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. అయితే వాళ్లలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, అందరి బ్యాగ్రౌండ్‌పై విచారణ చేస్తున్నారు. ఏదైనా సంస్థతో సంబంధం ఉందా,కావాలనే రెచ్చగొట్టి ఈపని చేయించారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిందితుల్లో ఒకరైన మనోరంజన్‌కి తెలిసిన వాళ్లతో ఎంపీ విక్రమ్ సింహాను పరిచయం చేసుకున్నాడు.
ఫ్రెండ్ అని చెప్పి పాస్ సంపాదించాడు
మనోరంజన్ 2016లో బీటెక్ పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడని తండ్రి దేవరాజే గౌడ చెప్పారు.దిల్లీ, బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేసినా తర్వాత పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. సమాజానికి ఏదైనా చేయాలనే తపన తన కుమారుడిలో కనిపిస్తూ ఉంటుందని ఆయన చెప్పారు.ఈ క్రమంలోనే స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువగా చదువుతాడన్నారు. ఉద్యోగం లేదన్న అసహనం.. లక్నోకి చెందిన సాగర్ శర్మకి,మనోరంజన్‌కి పరిచయముంది.ఆ పరిచయంతోనే ఎంపీ ప్రతాప్ సింహా ఆఫీస్‌కి తీసుకెళ్లి తన ఫ్రెండ్ అని పరిచయమై పాస్ సంపాదించాడు. సాగర్ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లన్నీ భగత్ సింగ్,మార్క్సిజం,చేగువెరా సిద్ధాంతాలతో నిండిపోయాయి. మూడో నిందితుడు విశాల్ శర్మ ఆటోరిక్షా డ్రైవర్‌గా పని చేసేవాడు.ఈ మధ్యే భార్యతో గొడవైనట్లు స్థానికులు అంటున్నారు.
తీవ్ర నిరాశలో ఉన్నత విద్యావంతురాలు
ఈ దాడి వెనకాల విశాల్ శర్మ భార్య హస్తం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన నీలందేవి పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతోంది. MA,BEd,M.Ed,M.Philతో పాటు NET ఎగ్జామ్‌ని క్లియర్ చేసి టీచర్ ఉద్యోగం కోసం నిరీక్షిస్తోంది. పార్లమెంట్ బయట కలర్ టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరిలో ఈ యువతి కూడా ఉంది.ఉద్యోగం రాలేదని తీవ్ర అసహనంతో ఉంటున్నారని ఆమె తల్లి చెప్పారు. మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్లంబర్‌కి హెల్పర్‌గా చాలా రోజుల పాటు పని చేసి అది నచ్చక మానేశాడు. గుడ్‌గావ్‌లోని ఓ ఇంట్లో మనోరంజన్, సాగర్, నీలం, అమోల్ కలిసే ఉంటున్నారని, లలిత్ ఝా అనే ఓ లెక్చరర్ మాస్టర్ మైండ్ అని అనుమానిస్తున్నారు.