Page Loader
లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌ 
స్పీకర్‌ ఓంబిర్లా ఆగ్రహం

లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 22, 2023
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ, బీఎస్పీ ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో గురువారం చంద్రయాన్‌-3 విజయంపై సభలో చర్చ సందర్భంగా బిధూరీ, బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీని తీవ్ర పదజాలంతో దూషించారు. బీజేపీ ఎంపీ వైఖరిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని డానిష్‌, స్పీకర్‌కు లేఖ రాశారు. బీధూరీ వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఖండించగా, రక్షణ‌మంత్రి రాజ్‌నాథ్‌ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా సూచన మేరకు షోకాజ్ నోటీసులు స్పీకర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పీకర్‌కు అలీ లేఖ