Page Loader
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2023
10:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఫలితంగా కొత్త పార్లమెంటులో ఆమోదం పొందిన తొలి బిల్లుగా మహిళా బిల్లు చరిత్ర సృష్టించింది. 215 మంది బిల్లుకు అనుకూలంగా, 0 వ్యతిరేకంగా ఓటు వేశారు. గురువారం ఉదయం రాజ్యసభ ముందుకు వచ్చిన ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సభ ప్రారంభమయ్యాక, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మహిళా బిల్లును పెద్దలసభలో ప్రవేశపెట్టారు.

Details 

రాష్ట్రపతి ఆమోదం లాంఛనం

మరోవైపు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందించే నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లుకు బుధవారం లోక్‌సభలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉభయ సభలు ఆమోదించిన సందర్భంగా రాష్ట్రపతి ఆమోదముద్ర లాంఛనం కానుంది. దీంతో కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 చట్టరూపం దాల్చనుంది. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) ప్రక్రియ పూర్తి అయ్యాకే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని, ఇందుకు 2029 వరకు సమయం పడుతుందని కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా