
Kodali Nani: మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్సీపీ కీలక నేత,మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని పై కృష్ణా జిల్లా ఎస్‌పీ గంగాధర్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ రావు,డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేస్తూ.. కొడాలి నాని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని, ఆయన కదిలకలపై నిరంతరం నిఘా ఉంచాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో,ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా ఎస్‌పీ గంగాధర్ లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు.
వివరాలు
ముంబైలో హృదయ సంబంధిత శస్త్రచికిత్స
రాష్ట్రవ్యాప్తంగా కొడాలి నానిపై అనేక కేసులు నమోదైన నేపథ్యంలో,ఆయన దేశం విడిచి వెళ్లిపోవడం తగదని భావించిన అధికారులు,దేశంలోని ఎయిర్‌పోర్టులు,ప్రధాన పోర్టులకు సంబంధించి పోలీసులు లుక్ అవుట్ నోటీసుల సర్క్యులర్‌ను పంపారు.
ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితమే కొడాలి నాని ముంబైలో హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతిలో ఉన్నట్టు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు
మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2025
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్‌పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ
కొడాలి నాని పాస్‌పోర్టు సీజ్ చేసి ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి ఇటీవల ఫిర్యాదు pic.twitter.com/4m3WCuE8VD