NCP MLA Jitendra Awhad: "రాముడు మాంసాహారి" ..NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ వ్యక్తులు ,అగ్రనేతలు హాజరవుతున్నారు.
అటు ఏర్పాట్లు జరుగుతుండగానే ఇటువైపు రాజకీయ దుమారం కొనసాగుతోంది.
ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు జితేంద్ర అవద్ రాముడి పైన వివాస్పదవ్యాఖ్యలు చేశారు."రాముడు మాంసాహారి" అని అన్నారు.
మహారాష్ట్రలోని షిరిడీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అవద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాముడు బహుజనులకు చెందినవాడని,అతను జంతువులను వేటాడి తినేవాడని అన్నారు. రాముడిని ఉదాహరణగా చూపించి ప్రతి ఒక్కరినీ శాఖాహారులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
కానీ శ్రీరాముడు శాఖాహారుడు కాదని, అతను మాంసాహారుడన్నారు. 14 సంవత్సరాలుగా అడవిలో ఉన్న వ్యక్తి - శాఖాహారం కోసం ఎక్కడికి వెళ్తాడు?"అంటూ ప్రశ్నించారు.
Details
ఎన్‌సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తాం: రామ్ కదమ్
ఈ నెలాఖరులో ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో కొత్త రామ మందిరానికి మహా సంప్రోక్షణ జరగడానికి ముందు అవద్ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అతనిపై చర్య తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.
అజిత్ పవార్ వర్గానికి చెందిన మద్దతుదారులు బుధవారం రాత్రి అవద్ ఇంటి వద్ద ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అవద్ ఇంటి ముందు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నేతృత్వంలో నిరసనకారులు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎన్‌సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తామని తేల్చి తెలిపారు.