
Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో ఇవాళ భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Details
చేపలు పట్టడానికి వెళ్లకూడదు
పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణం చేయవద్దని, వరద నీటిలో ఈత, చేపలు పట్టడం వంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం అక్కడ 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం నమోదవుతోంది. దీనితో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి అధికారులు అప్రమత్తమయ్యారు.