Page Loader
IMD: అల్పపీడన ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

IMD: అల్పపీడన ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ముందుకెళ్తోంది. దీంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావం సోమవారం నాటికి తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. దీని ప్రభావంతో డిసెంబర్ 16 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. బుధవారం నుంచి శనివారం వరకు కోస్తాంద్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. డిసెంబర్ 29న విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

Details

ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ

ఈ వాయుగుండం కారణంగా గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరంలోని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ఓడ రేవులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అమలు చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వాయుగుండం ప్రభావం కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాలపై అధికంగా ఉండొచ్చని ఐఎండీ వెల్లడించింది.