LOADING...
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు.. ఏపీలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు.. ఏపీలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు.. ఏపీలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటే అవకాశముందని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌తో పాటు ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.

Details

ఈ జిల్లాలో భారీ వర్షాలు 

మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వైఎస్సార్‌ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్‌, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి. అలాగే సోమవారం పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి.