LOADING...
Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తీరం చేరే అవకాశం!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తీరం చేరే అవకాశం!

Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తీరం చేరే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో ఇది ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో నేడు, రేపు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Details

పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం

ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.