AP Rains: ఏపీకి పొంచివున్న మరో వాయు'గండం'.. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియర్‌లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
వివరాలు
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశముంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
APSDMA చేసిన ట్వీట్
నవంబర్ 05, మంగళవారం :
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 4, 2024
•శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.