Page Loader
M Jethamalani: సోరోస్-సోనియా గాంధీ లింక్స్‌పై విరుచుకుపడిన మహేష్ జెఠ్మలానీ..
సోరోస్-సోనియా గాంధీ లింక్స్‌పై విరుచుకుపడిన మహేష్ జెఠ్మలానీ..

M Jethamalani: సోరోస్-సోనియా గాంధీ లింక్స్‌పై విరుచుకుపడిన మహేష్ జెఠ్మలానీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ వెల్లడించింది. ఈ ఆరోపణలో, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చూడటానికి ఆర్థిక సహాయం అందించిన సంస్థతో సోనియా గాంధీ సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ, ఈ అసోసియేషన్ భారత్ అంతర్గత వ్యవహారాలలో విదేశీ సంస్థల ప్రభావాన్ని పెంచుతుందని, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత్ ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు అమెరికన్ డీప్‌స్టేట్ కుట్రలు చేస్తోందని పేర్కొంది. వీటిలో కీలకంగా ఉన్న జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది

వివరాలు 

జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్, సోనియా గాంధీ అపవిత్ర బంధం..

సీనియర్ లాయర్ మహేష్ జఠ్మలానీ సోనియా గాంధీ, జార్జ్ సోరోస్ మధ్య ఉన్న సంబంధాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఫోరమ్ ఆఫ్ డెమోక్రాటిక్ లీడర్స్ (ఆసియా పసిఫిక్) అనే సంస్థకు నిధులు సమకూర్చబడినట్లు, సోనియా గాంధీ ఆ ఫోరమ్ కో ప్రెసిడెంట్‌గా ఉండటాన్ని ''అపవిత్ర బంధం''గా ఆయన అభివర్ణించారు. ఆయన ఆరోపణ మేరకు,యాంటీ టెర్రర్ చట్టాల కింద సోనియాగాంధీపై దర్యాప్తు సంస్థలు తప్పనిసరిగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

వివరాలు 

బీజేపీ నుండి సోరోస్ లింకుల గురించి ఆరోపణలు

అయితే, జఠ్మలానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు, సోమవారం బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలకు ప్రత్యర్థిగా స్పందించింది. ''మేం దేశభక్తులం. భారత వ్యతిరేక వైఖరిని ప్రస్తావించే ప్రశ్నే లేదు'' అని చెప్పింది. ప్రియాంకా గాంధీ సోరోస్‌తో ఉన్న లింక్స్‌ను హాస్యాస్పదంగా తప్పించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేస్తుండగా, బీజేపీ నుండి సోరోస్ లింకుల గురించి ఆరోపణలు వచ్చాయి.