Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్
లంచం ఎందుకు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ముర్షావలి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీఆర్వో తనను లంచం అడుగుతున్నారని, తహసీల్దారుకు ఫిర్యాదు వచ్చిన రైతుకు లంచం విశిష్టత, అవసరాన్ని సదరు తహసీల్దారు హితబోధ చేయడం గమనార్హం. రైతును లంచం అడిగిన వీఆర్వోపై చర్యలు తీసుకోకుండా.. లంచ తీసుకోవడాన్ని సమర్థిస్తూ తహసీల్దారు ముర్షావలి మాట్లాడటం విస్తుగొల్పుతోంది. తహసీల్దారు ముర్షావలి.. లంచం ఎందుకు తీసుకుంటామో సవివరింగా వివరించారు. తమ మండలానికి మంత్రులు, ఉన్నతాధికారులు వస్తారని, అప్పుడు లక్షల రూపాయలు తమకు ఖర్చు అవుతాయని ఆ రైతుకు తహసీల్దారు చెప్పారు.
తహసీల్దారు సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
మంత్రులు, ఉన్నతాధికారులు తమ మండలానికి వచ్చిన అయే ఖర్చును తమకు వచ్చే జీతం నుంచి ఖర్చు పెట్టాలా? అంటూ ఆ రైతును తహసీల్దారు నిలదీయం గమనార్హం. ఇంతటితో ఆగకుండా..లంచం ఈ నాటిది కాదని, శ్రీ రాముడి కాలంలోనూ లంచాలు ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. రెండు నెలల క్రితం ఒక మంత్రి ఇక్కడికి వచ్చారని తహసీల్దారు గుర్తు చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా నలుగురు వీఆర్వోలు రూ.1.75లక్షలు ఖర్చు పెట్టారని, వారికి తిరిగి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్దారు వ్యాఖ్యలను సీరియస్‌గా ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేసారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.