Page Loader
Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు 
వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు

Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీ లత ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఒకే ఒక్క జాతీయ స్థాయి ఇంటర్వ్యూతో ఆమె ఇటీవల ప్రధాని మోదీ దృష్టిని కూడా ఆకర్షించారు. కాగా, హైదరాబాద్ పాతబస్తీలోని బుధవారం నాడు నిర్వహించిన రామనవమి ర్యాలీలోని ఓ వీడియో ప్రస్తుతం వివాదాస్పందంగా మారి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మాధవి విల్లుతో బాణం వదిలినట్లుగా అభినయించారు. ఎదురుగానే మసీదు ఉండడంతో ఆమె అలా బాణం వదలడం వివాదానికి దారి తీసింది. దీంతో, మాధవీ లత మసీదు మీదకి బాణం వదులుతున్నట్లు అభినయించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Details 

వివాస్పద వీడియోపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ

ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మాధవి లత అభ్యంతరకర రీతిలో వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి చర్యల పట్ల ఎన్నికల సంఘం కళ్లు మూసుకుంటోందా అని ప్రశ్నించారు. "మీరు ఎన్నికల సంఘం, సీఈఓ, పోలీసు కమిషనర్‌ను ఎందుకు అడగరు? నేనేమైన హైదరాబాదు కొత్వాల్‌నా '' అని విలేకరులను ప్రశ్నించారు. "ఈ విషయం ఎన్నికల కమిషన్ కి తెలీదా ? నేను అదే చేసి ఉంటే, ఈ పాటికి నా మీద సుమోటో కేసు ఫైల్ చేశావారు ' అని ఒవైసీ అన్నారు.

Details 

ఎక్స్ వేదికగా మాధవీలత క్షమాపణ

వైరల్ అవుతున్న ఈ వీడియోపై బీజేపీ అభ్యర్థి మాధవి లతా ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పారు. నెగిటివిటీని సృష్టించేందుకు నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉందని నా దృష్టికి వచ్చింది. ఇది ఒక అసంపూర్ణమైన వీడియో. అలాంటి ఈ వీడియో వల్ల మీలో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నాను. నేను అందరినీ గౌరవిస్తాను కాబట్టి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను'' అని మాధవీ లత ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాధవీలత చేసిన ట్వీట్