తదుపరి వార్తా కథనం
మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి
వ్రాసిన వారు
Stalin
Apr 19, 2023
05:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక లోకోమోటివ్ పైలట్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. రెండు ట్రైన్లు బలంగా ఢీకొనడం వల్ల ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
అలాగే అనేక కోచ్‌లు బోల్తా పడ్డాయి. రెండు రైళ్లలోనూ బొగ్గు లోడ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కదులుతున్న రైలు అనుప్పూర్ నుంచి వస్తోంది.
ఈ ఘటనతో బిలాస్‌పూర్-కట్నీ మార్గంలో రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. ఇంత భారీ ప్రమాదానికి కారణమేమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభిస్తామని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) సీనియర్ అధికారులు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండు ట్రైన్లు ఢీకొని చెలరేగుతున్న మంటలు
#BreakingNews : Madhya Pradesh Shahdol Two goods train collied.
— Abhishek Nayan (ABP News) (@Abhisheknayan81) April 19, 2023
#TrainAccident pic.twitter.com/OfCbdxosUp