
మధ్యప్రదేశ్: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో 35ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు.
బాధిత మహిళ వ్యవసాయ పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తాము సంఘటనా స్థలానికి వెళ్లినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ వివేక్ శర్మ తెలిపారు.
వెంటనే మహిళను సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అశోక్‌నగర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వివేక్ శర్మ తెలిపారు.
మోదీ
నిందితుల కోసం పోలీసుల గాలింపు
కిడ్నాప్ చేసిన వాళ్లలో తనకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
తనపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు వ్యవసాయ పొలంలో పడవేశారని పోలీసులకు వివరించింది.
ఈ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకరు హత్యకేసులో సాక్షిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో బాధితురాలి భర్త నిందితుడని వెల్లడించారు.
మహిళ వైద్య పరీక్షల రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని, అవి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ మేరకు నిందితులపై గ్యాంగ్ రేప్, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన సంబంధిత కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.