సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వాక్ స్వాతంత్య్రం విద్వేషం కాకూడదు
సనాతన ధర్మం'పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమే సనాతన ధర్మమని కోర్టు తెలిపింది. అలాంటి వాటిని ఎందుకు నాశనం చేయాలని ఆలోచిస్తున్నారని మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. సనాతన ధర్మం వ్యతిరేకతపై విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకోవాలని ప్రభుత్వం ఇటీవలే ఓ సర్క్యూలర్ జారీ చేసింది.దీన్ని సవాల్ చేస్తూ ఇళంగోవన్ హైకోర్టును ఆశ్రయించారు. సమాన పౌరులున్న సమాజంలో అంటరానితనాన్ని భరించలేమని జస్టిస్ శేషసాయి అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మంలో ఎక్కడో చోట అంటరానితనాన్ని అనుమతించినా, రాజ్యాంగంలోని 17వ ఆర్టికల్ దాన్ని నిర్మూలిస్తుందన్నారు. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కే అయితే అది విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదని, మత విశ్వాసాలపై మాట్లాడి మనసులను గాయపర్చకూడదని సూచించారు.