'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్
ఈ వార్తాకథనం ఏంటి
'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి'అన్న తన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
బీజేపీ తమను తాము కాపాడుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా మార్చుకున్నారని ఉదయనిధి ధ్వజం ఎత్తారు.
అయోధ్య స్వామిజి రివార్డ్ పై ఉదయనిధి స్పందిస్తూ, డీఎంకే కార్యకర్తలు ఎవరు కూడా కేసులు పెట్టవద్దని, దిష్టిబొమ్మలను దహనం చేయవద్దని కోరారు.
మణిపూర్ హింస,7.5 లక్షల కోట్ల అవినీతితో సహా వాస్తవాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మోదీ అండ్ కంపెనీ సనాతన వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారని" ఉదయనిధి మండిపడ్డారు.
Details
బీజేపీ చేసిన అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ఈ దుష్ప్రచారం: ఉదయనిధి
'సామాజిక న్యాయం ఎప్పటికీ వర్థిల్లాలి' అంటూ ఓ శీర్షికతో కూడిన ప్రకటనను ఉదయనిధి స్టాలిన్ జారీ చేశారు.
పెరియార్, అన్న, కలైంజ్ఞర్, పెరసిరియార్ సిద్ధాంతాలు విజయవంతం అవ్వాలని, దీనికోసం అందరం కలిసి పని చెయ్యాలని పిలుపునిచ్చారు.
బీజేపీ తమను తాము కాపాడుకునేందుకు తాను అన్న వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారన్నారు.
అబ్బదపు వార్తల ఆధారంగా.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం చాల ఆశ్చర్యకరంగా ఉందని ఉదయనిధి అన్నారు.
అత్యత్తుమ పదవుల్లో ఉంటూ నాపై దుష్ప్రచారం చేసినందుకు నేను వారిపై కేసులు పెట్టాలి, కానీ.. వారు చేసిన అవినీతి కప్పిపుచ్చుకునేందుకు వారికి ఉన్న మార్గం ఇదేనని తనకి తెలుసునని ఉదయనిధి అన్నారు