LOADING...
Maha Kumbh: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. 15,000 మంది పారిశుధ్య కార్మికులతో క్లీన్‌నెస్ డ్రైవ్‌.. 
గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. 15,000 మంది పారిశుధ్య కార్మికులతో క్లీన్‌నెస్ డ్రైవ్‌..

Maha Kumbh: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. 15,000 మంది పారిశుధ్య కార్మికులతో క్లీన్‌నెస్ డ్రైవ్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 60 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ నేపథ్యంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్ లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు భారీ స్వచ్ఛత డ్రైవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15వేల మంది కార్మికులు చీపుర్లు పట్టుకుని పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు,ప్రయాగ్‌రాజ్‌ మేయర్‌ గణేశ్‌ కేసర్వాని, మహాకుంభ్‌ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో విడుదల కానుందని అధికారులు ప్రకటించారు. 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు.

వివరాలు 

60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు

ఇదిలాఉండగా, ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు పవిత్ర త్రివేణి సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.