Page Loader
మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 
మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన

మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 

వ్రాసిన వారు Stalin
Oct 01, 2023
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహబూబ్ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. తెలంగాణలో చాలా జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మోదీ పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులువు అవుతుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే సమ్మక్క, సారలమ్మ పేరుతో యూనివర్సీటీని కూడా ఏర్పాటు చేయున్నట్లు మోదీ ప్రకటించారు.

మోదీ

రూ.13,500 విలువైల ప్రాజెక్టులకు శంకుస్థాపన 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహబూబ్ నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమలకు శ్రీకారం చుట్టారు. రూ.13,500 విలువైల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్త శంకుస్థాపన చేసిన వాటిలో జాతీయ రహదారులు, రైల్వేతో పాటు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. కాచిగూడ-రాయ్‌చూర్‌ మధ్య మోదీ కొత్త రైలును ప్రారంభించారు. అలాగే హసన్‌-చర్లపల్లి హెచ్‌పీసీఎల్‌ ఎల్పీజీ పైప్‌లైన్‌‌ను జాతికి అంకితం ఇచ్చారు. అంతేకాకుండా హెచ్‌సీయూలో నూతన భవానాలను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రాజెక్ట్‌ పైప్‌లైన్‌ ప్రారంభించారు. మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్ట్‌లో కీలకమైన జక్లేర్‌-కృష్ణా రైల్వే లైన్‌‌ను ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. రూ.2457 కోట్లతో సూర్యాపేట-ఖమ్మం హైవేకు మోదీ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా వరంగల్‌-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి పనులకు మోదీ శంకుప్థాపన చేశారు.

మోదీ

మోదీకి గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని స్వాగతం

ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్వాగతం పలికారు. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ మోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తెలంగాణలో మోదీ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండటం ఇది ఆరోసారి కావడం గమనార్హం హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికార్‌ మహబూబ్ నగర్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న మోదీ