Mahalakshmi scheme: తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ చేసిన సర్కార్
Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లను రూ.500కే ఇచ్చే పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం రేవంత్ రెడ్డి సర్కారు జిఓ నెం 2ను విడుదల చేసింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ స్కీమ్‌ను వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నవారే సబ్సిడీ సిలిండర్‌కు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, తెల్ల రేషన్ కార్డుతో పాటు మహిళపై ఎల్‌పీజీ కనెక్షన్ ఉండాలని, గత మూడు సంవత్సరాలు సిలిండర్ల సగటు వినియోగం ఉండాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో చెప్పింది.